భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఏపీ పీజీసెట్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ సెప్టెంబర్ 12న మెుదలైంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, అందించిన కాప్చా కోడ్‌ని ఉపయోగించి pgcet-sche.aptonline.in అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా వారి వెబ్ ఆప్షన్‌లను యాక్సెస్ చేయవచ్చు.

దీనికి ముందు అందించే కోర్సుల జాబితా, అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌లు, సీట్ల లభ్యత, ఫీజులు, కళాశాలల గురించి వివరణాత్మక సమాచారం అభ్యర్థులు తెలుసుకోవడం మంచిది. తద్వార వెబ్ ఆప్షన్స్‌లో నచ్చిన కళాశాలను ఎంచుకోవచ్చు. కళాశాలలు, ప్రోగ్రామ్‌లలో సీట్ల గురించి జాగ్రత్తగా చెక్ చేయాలి.

వెబ్ ఆప్షన్ల ఫారమ్ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించడం ముఖ్యం. అందువల్ల పోర్టల్‌లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ పెట్టుకునేముందుకు దరఖాస్తుదారులు ఫారమ్‌లో నమోదు చేసిన అన్ని వ...