భారతదేశం, నవంబర్ 2 -- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.1,500 కోట్ల విలువైన భారీ మనీలాండరింగ్, అంతర్జాతీయ హవాలా రాకెట్‌ను వెలుగులోకి తెచ్చింది. నకిలీ పత్రాలను ఉపయోగించి, కస్టమ్ సాఫ్ట్‌వేర్ దిగుమతి నెపంతో భారతదేశం వెలుపలకు నిధులను అక్రమంగా తరలించిన కేసులో ఈడీ.. ఢిల్లీ, కోల్‌కతాలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ మొత్తం కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ నుండి సింగపూర్, హాంగ్‌కాంగ్, చైనాలతో సంబంధాలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విశాఖపట్నం సబ్ జోనల్ కార్యాలయం, మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA), 2002 నిబంధనల ప్రకారం ఢిల్లీ, కోల్‌కతాలోని ఏడు కీలక ప్రదేశాలలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ప్రాథమిక విచారణల ప్రకారం ఈ కుంభకోణం మొత్తం విలువ సుమారు రూ.1,500 కోట్లుగా అంచనా వేశారు.

ఈ కేసు మూలాలు 2017లో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఫి...