భారతదేశం, సెప్టెంబర్ 15 -- నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన సమయంలో నోటిఫికేషన్లు రాక, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఏజ్ బార్ సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించనుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తో పాటు ఇతర ప్రభుత్వ నియామక సంస్థల ద్వారా చేపట్టే ఉద్యోగ ప్రకటనలకు అర్హత పరిధి విస్తరించింది. సవరించిన నిబంధనల ప్రకారం.. యూనిఫామ్ పోస్టులు మినహా మిగిలిన అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు.

స...