Andhrapradesh, ఆగస్టు 15 -- ఏపీ డీఎస్సీ ప్రక్రియకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. సవరించిన డీఎస్సీ తుది మార్కుల స్కోర్ కార్డులు అందుబాటులోకి రాగా.. టెట్ మార్కుల విషయంలో విద్యాశాఖ మరో ఛాన్స్ ఇచ్చింది. టెట్ స్కోర్ కార్డుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చని సూచించింది. ఈ గడువు శుక్రవారం(ఆగస్ట్ 15)తో పూర్తవుతుందని స్పష్టం చేసింది.

ఇప్పటికే సవరించిన టెట్‌ మార్కులతో కూడిన స్కోర్‌ కార్డులను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంకా ఏవరైనా ఉంటే కూడా వెంటనే టెట్ స్కోర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అభ్యర్థులు. సవరించిన మార్కులు చూసుకోవచ్చని డీఎస్సీ కన్వీనర్ తెలిపారు. స్కోర్ కార్డు కోసం ముందుా ఏపీ డీఎస్సీ అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వె...