Andhrapradesh, ఆగస్టు 28 -- ఏపీ జైళ్ల నుంచి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా కడప, నెల్లూరు జిల్లాలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ ప్రిసన్స్‌ అండ్ కరెక్షనల్ సర్వీస్‌, ఆంధ్రప్రదేశ్ వివరాలను పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య గల అభ్యర్థులు వారి సీవీ(బయోడేటా)ని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూర్ రాగ్నే, కొల్లిస్ రెసిడెన్సీ , 7వ లేన్, రాజరాజేశ్వరి నగర్, తాడేపల్లి, గుంటూరు జిల్లా - 522501 చిరునామాకు పోస్ట్ చేయాలి.లేదా digprisonsgnt@gmail.com కు మెయిల్ చేయవచ్చు.సెప్టెంబర్‌ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....