భారతదేశం, జూన్ 24 -- సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని అమరావతిలో చేపట్టనున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. తొలి విడత భూ సమీకరణకు వర్తించినట్టుగా మలివిడత భూ సమీకరణకు నిబంధనలు వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏడో ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28వేల 546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైజాగ్‌లో కాగ్నిజెంట్‌కు సంబంధించి చర్చ జరిగింది. 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించంది. రూ.1582 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కాగ్నిజెంట్ ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్...