Andhrapradesh, సెప్టెంబర్ 19 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే 13 బిల్లులకు ఆమోదముద్ర పడింది.

నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ చేసిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఏపీ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణల ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. లిఫ్ట్‌ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇక వైఎస్‌ఆర్‌ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.

ఓటర్ల జాబితా తయారీకి తేదీలు ఖరారు ప్రతిపాదనకు, పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్...