Andhrapradesh, జూలై 18 -- ఏపీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వెబ్ ఆప్షన్ల(కాలేజీల ఎంపిక) గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు వెంటనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

కాలేజీల్లో సీట్లు పొందేందుకు వెబ్ ఆప్షన్లను తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు. కేవలం కొన్నిగంటలు మాత్రమే మిగిలి ఉండటంతో అర్హులైన అభ్యర్థులు. జూలై 18వ తేదీలోపు https://eapcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను సబ్మిట్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి.

ఇక రేపు (జూలై 19) వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉ...