Andhrapradesh, సెప్టెంబర్ 18 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే థర్జ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లతో పాటు వెబ్ ఆప్షన్లు కూడా పూర్తయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఇవాళే సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే అధికారులు ఈ తేదీని మార్పు చేశారు. ఈనెల 20వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తామని ప్రకటించారు.

ఏపీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కింద సీట్లు పొందే విద్యార్థులు. ఈనెల 22లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఈనెల 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. https://eapcet-sche.aptonline.in వెబ్ సైట్ ద్వారా అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.

కన్వీనర్ కోటాలో 1,53,964 సీట్లు ఉండగా.. మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌లో 1,19,666 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో దశ కౌన్సెల...