Andhrapradesh, అక్టోబర్ 11 -- ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజుపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని సూచించింది. ఇక రూ. 100 ఫైన్ తో అక్టోబర్ 30 వరకు ఫీజు కట్టుకునే అవకాశం కల్పించారు. ఈ తేదీల తర్వాత అవకాశం ఇవ్వమని బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల ప్రిన్సిపల్స్ సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇక ఇంటర్ పరీక్షల ఫీజుల వివరాలు చూస్తే. జనరల్ లేదా వొకేషనన్ కోర్సుల థియరీ పరీక్షలకు రూ.600గా ఉంది. ప్రాక్టికల్స్‌కు జనరల్ కోర్సులు(సెకండ్ ఇయర్), వొకేషనల్(ఫస్ట్, సెకండ్ ఇయర్) విద్యార్థులకు రూ.275గా నిర్ణయించారు. జనరల్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులకు రూ.165 కాగా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్(సెకం...