ఏపీ ఇంటర్ పరీక్షల ప్రశ్నల్లో మార్పులు.. క్రియేటివిటీ పెంచేలా క్వశ్చన్స్.. బట్టీకి బై-బై
భారతదేశం, నవంబర్ 7 -- ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రాబోయే 2027-28 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల రూపురేఖలను మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP-2020) లక్ష్యాలకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ పరఖ్ మార్గదర్శకాలకు లోబడి ఈ నూతన విధానాన్ని తీసుకురానున్నారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న విధానంలో విద్యార్థులు పుస్తకాల్లోని సమాధానాలను కంఠస్థం చేసి బట్టీ పట్టి పరీక్షల్లో యథాతథంగా రాసేవారు. అయితే ఇకపై ఈ ధోరణికి స్వస్తి పలకనున్నారు. విద్యార్థుల్లోని ఆలోచనా శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యం, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలను రూపొందించనున్నారు.
విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలు, సృజనాత్మకతను అంచనా వేసేందుకు ప్రశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.