భారతదేశం, నవంబర్ 14 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు బలమిచ్చేలా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) గ్రూప్ ఒక చారిత్రక అడుగు వేసింది. విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025లో ఈ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏకంగా Rs.30,650 కోట్ల విలువైన మూడు కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు రాష్ట్రాన్ని గ్లోబల్ క్లీన్ ఎనర్జీ కేంద్రంగా మార్చడంలో దోహదపడతాయి.

ఈ సందర్భంగా ఎస్ఎస్‌ఈఎల్ గ్రూప్ పూర్తికాల డైరెక్టర్ వంశీ రెడ్డి నర్రెడ్డి మాట్లాడుతూ... ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులు మాత్రమే కాదని, భారత్ స్వచ్ఛ ఇంధన భవిష్యత్తును బలోపేతం చేయాలనే తమ దీర్ఘకాలిక లక్ష్యానికి అద్దం పడతాయని తెలిపారు.

"ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపాంతరానికి మరియు ఆధునిక ఇంధన వ్యవస్థల నిర్మాణానికి ఈ ఒప్పందాలు కీల...