Andhrapradesh, ఆగస్టు 19 -- కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయమూ పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం అమలును మంగళవారం సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఏడాది ఉగాది నాడు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించగా..అప్పటి నుంచి బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,40,697 బంగారు కుటుంబాలను 1,41,977 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.."పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్దాంతం. సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అని భావించే సిద్దాం...