భారతదేశం, జూన్ 2 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ మేరకు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇవాళ (జూన్ 2, మంగళవారం) కూడా రాష్ట్రంలో వర్షాలతో పాటుగా కొన్నిచోట్ల ఎండ ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

మంగళవారం(జూన్ 2) నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రాష్ట్రంలో ఎండల తీవ్రత నేడు కూడా భారీగానే కొనసాగింది. సోమవారం (జూన్ 1) నాడు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్ర...