భారతదేశం, జూన్ 18 -- ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్య భద్రత, ప్రత్యేక అవసరాల గుర్తింపు దిశగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ 'ప్రశస్త్ 2.0' (Prashast 2.0) మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి. శ్రీనివాసరావు ప్రకటించారు. పిల్లల్లో ఉండే 21 రకాల దివ్యాంగత్వాలను(Disabilities) ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ అప్‌గ్రేడెడ్ యాప్‌ను ఉపయోగించనున్నారు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీనిద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ముందస్తుగానే గుర్తించి, వార...