Andhrapradesh, సెప్టెంబర్ 18 -- ఏపీలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు సీట్లను కేటాయించారు. అన్ని కోర్సుల్లో కలిపి మొత్తం 1,30,273 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు. ఈనెల 22 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సకాలంలో రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపు రద్దవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1200 కాలేజీల్లో 3,82,038 సీట్లు అందుబాటులో ఉండగా. 2,51,765 సీట్లు మిగిలిపోయాయి. మరో విడతలో మిగిలిన సీట్ల భర్తీకి అవకాశం కల్పించే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 70,005 సీట్లు ఉండగా... 27,348 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ప్రైవేట్ కాలేజీల్లో 28,1940 సీట్లు ఉండగా 94,051 సీట్లు నిండాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో 1,461 సీట్లకు 428 భర్తీ అయ్యాయి.

మొత్తం డిగ్రీ క...