భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహణ అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు (జూడా) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై సానుకూలంగా స్పందిస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది. పెరిగిన ఈ స్టైపెండ్ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్‌షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లకు 10 శాతం, పీజీ (PG) విద్యార్థులకు 5 శాతం, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు 3.5 శాతం చొప్పున స్టైపెండ్ పెరిగింది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 34.08 కోట్ల అదనపు భారం పడనుంది.

గత నెలలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా స్టైపెండ్ పెంపు కోసం నిరవధిక సమ్మెకు దిగిన ...