Andhrapradesh, ఆగస్టు 13 -- జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై వచ్చే నెల 15 తేదీ నాటికి తమ నివేదిక సీఎం చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం(జీవోఎం) నిర్ణయించింది. రాష్ట్ర్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు ఏడుగురు మంత్రులతో ఏర్పాటైన జీవోఎం తొలిసారిగా బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో భేటి అయ్యింది.

ఈ సమావేశానికి మంత్రి అనగానితోపాటు మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తోపాటు రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 31లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ మొత్తంగా ముగించాల్సి ఉన్నందున జీవోఎం తన నివేదికను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

గత ప్ర...