ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటు సులభతరం.. నిబంధనలు సరళీకరిస్తూ ఉత్తర్వులు!
భారతదేశం, నవంబర్ 5 -- ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రారంభించాలనుకునే యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పాఠశాలల స్థాపన, గుర్తింపు ప్రక్రియలో ఇప్పటివరకు ఉన్న కఠినమైన నిబంధనలను సవరిస్తూ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అనుమతుల కోసం నెలల తరబడి వివిధ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సులభమైన పద్ధతిలో నిబంధనలను సరళీకరించింది.
ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల నిబంధనలకు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఈ నిర్ణయంతో కొత్తగా స్కూళ్లు పెట్టాలనుకునేవారికి సులభం కానుంది. కొత్త సవరణల ప్రకారం ప్రైవేట్, నిధులందించే పాఠశాలల అనుమతుల ప్రక్రియలో పారదర్శకత పెంచేలా అధికారుల బాధ్యతలను స్పష్టంగా వర్గీకరించారు.
ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల స్థాపనకు జిల్లా విద్యాశాఖా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.