భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు డీఏ, పీఆర్సీ బకాయిలు, కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంతోపాటుగా కీలక అంశాలపై డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దసరాకు కనీసం రెండు డీఏలు అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తాజాగా డీఏపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి పయ్యావలు కేశవ్ క్లారిటీ ఇచ్చారు.

పీఆర్సీ నియామకం, వేతన సవరణ, తాత్కాలిక భృతి మెుత్తం ఎప్పటిలోగా చెల్లించాలనేది ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక డీఏ గురించి మాట్లాడుతూ.. గతేడాది జూన్ 12వ తేదీ నాటికి 11వ పీఆర్సీ బకాయిలతో కలిపి మెుత్తం డీఏ బకాయిలు 12,119.77 కోట్లు ఉన్నాయన్నారు. వీటిని ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగులకు చెల్లిస్తామని వెల్లడించారు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల సంఘాలు తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని,...