Andhrapradesh, ఆగస్టు 13 -- రాష్ట్రంలోని మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్త్రీ శక్తి పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేయనుంది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ అమలుపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. కొన్ని సూచనలు చేశారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధిక రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలన్నారు. అందుకు తగ్గట్టు సామర్ధ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని... ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ప్రయా...