Andhrapradesh, ఆగస్టు 5 -- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 న తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

ఈ పథకం అమల్లో ఎటు వంటి లోటుపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలో అమలు తీరును పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు.

ఈ నెల 6 వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర లబించనుందని మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగరిదన్నారు. ఈ పథ...