భారతదేశం, సెప్టెంబర్ 23 -- రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు వైకల్యం లేదా వయోభారం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు ప్రతి నెలా వారి ఇంటి వద్దే పింఛను మొత్తాన్ని అందిస్తోంది. ఈ సంక్షేమ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు గానూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 33,485.10 కోట్లను కేటాయించామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ), గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

మొత్తం 62 లక్షల మంది లబ్ధిదారులలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) పరిధిలోకి వచ్చే 9.34 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం రూ. 382.82 కోట్ల నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ నూత...