Andhrapradesh, సెప్టెంబర్ 19 -- ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో నాలుగు రోజులు దక్షిణ కోస్తా,రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలను వెల్లడించింది.

ఇవాళ (శుక్రవారం(19-09-25) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

ఇక కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవక...