భారతదేశం, డిసెంబర్ 21 -- మకర సంక్రాంతి అనేది తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణాన్ని చెబుతోంది. తెలుగువారి సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, కుటుంబంతో సమయాన్ని గడపడానికి సంక్రాంతి పండుగ గొప్ప అవకాశం. ఉద్యోగాలతో సిటీల్లో ఉండేవారు, చదువు కోసం హాస్టళ్లలో ఉండేవారు.. సరిగా ప్లాన్ చేసుకంటే ఊర్లో ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇందుకోసం 2026 సంక్రాంతి పండుగకు సరిగా మీరు ప్రణాళికలు వేసుకోవాలి.

ఈసారి సంక్రాంతికి జనవరి 10 నుండి 18, 2026 వరకు 9 రోజులు ప్లాన్ చేయవచ్చు. సాధారణంగా సంక్రాంతికి కేవలం రెండు సెలవులు మాత్రమే వస్తాయి. కానీ ఈసారి మీరు ప్లాన్ చేసుకుంటే 9 రోజుల అద్భుతమైన బ్రేక్ తీసుకోవచ్చు. అలా మీకు కలిసి వస్తాయి హాలీడేస్. ప్రియమైనవారితో సమయం గడపడం, పండుగ విందులు ఆస్వాదించడం, కొత్త సంవతర్సం ...