భారతదేశం, సెప్టెంబర్ 23 -- చిన్నపిల్లల ఆహారపు అలవాట్ల విషయంలో కొన్నిసార్లు ఇళ్లల్లో తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మల మధ్య, తల్లిదండ్రుల మధ్య వాదోపవాదాలు నడుస్తుంటాయి. పెద్దలు తమ పద్ధతులను అనుసరిస్తూ.. 'కొంచెం ఉప్పు కలిపితేనే కదా చప్పగా ఉన్న ఆహారం రుచిగా మారుతుంది..', 'చిటికెడు బెల్లం లేదా తేనె వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది' అంటూ చెబుతుంటారు.

కానీ, డాక్టర్లు, పరిశోధనల మార్గదర్శకాలను అనుసరిస్తున్న నేటితరం తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి ఉప్పు, పంచదార లేని ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే, శిశువుల సున్నితమైన శరీరాలకు, పెద్దలకు చిన్నదిగా అనిపించే ఈ పదార్థాలు దూర ప్రభావాలను కలిగిస్తాయని బెంగళూరులోని అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ విభాగం డాక్టర్ సెంథిల్ కుమార్ సదాశివం ...