భారతదేశం, జూలై 14 -- Ranbir Kapoor Buys 25 Acre Land: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కేవలం సినిమాలతోనే కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ దూసుకుపోతున్నారు. ముంబై వంటి కాంక్రీట్ జంగిల్ దాటి ప్రశాంతమైన వాతావరణంలో లగ్జరీ ఫామ్‌హౌస్‌లు, ఖరీదైన ల్యాండ్స్ కొనుగోలు చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ యానిమల్ హీరో రణ్‌బీర్ తాజాగా పుణెలో ఒక భారీ స్థలాన్ని తన సొంతం చేసుకున్నారు. పుణె జిల్లా ముల్షీ తాలూకా పరిధిలో దాదాపు 25.7 ఎకరాల విస్తీర్ణం గల భూమిని రణ్‌బీర్ కపూర్ కొనుగోలు చేశారు.

రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన అధికారిక పత్రాల ప్రకారం ఈ లావాదేవీ విలువ రూ. 16.42 కోట్లుగా నమోదైంది. పుణెలోని పింప్రి గ్రామంలో పక్కపక్కనే ఉన్న నాలుగు ల్యాండ్ పార్సళ్లను రణ్‌బ...