భారతదేశం, నవంబర్ 16 -- కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్ రంగాల్లో విదేశీ ఆధిపత్యానికి చెక్ పెడుతూ భారత్ కీలక అడుగు వేసింది. ఏఐ మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, చిప్ డిజైన్, ఇంధన నెట్‌వర్క్‌లకు రక్షణ కల్పించేందుకు అమెరికా సహా మరో ఎనిమిది మిత్రదేశాలతో కలిసి భారత్ కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 15న 'శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ ది సెక్యూర్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎండ్యూరింగ్ ప్రాస్పరిటీ' పేరిట ఈ చారిత్రక ఒప్పందంపై 10 దేశాలు సంతకాలు చేశాయి.

ఫిబ్రవరిలో కుదుర్చుకున్న 'పాక్స్ సిలికా' (Pax Silica) ఒప్పందానికి కొనసాగింపుగా ఈ డిక్లరేషన్ రూపుదిద్దుకుంది. నాటి ఒప్పందంలో భాగంగా 'సిలికాన్ స్టాక్' పరిరక్షణకు నమ్మకమైన దేశాల కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కీలక ఖనిజాల లభ్యత, సెమీకండక్టర్ల తయారీ, అధునాతన ఏఐ వ్యవస్థల భద్రత కోసం రూపొందించిన ఆ విస్తృత ప్రణా...