భారతదేశం, జూన్ 25 -- టెక్ బ్రాండ్ వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వివో టీ4 లైట్ 5జీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్టైలిష్ అండ్ స్ట్రాంగ్ డిజైన్‌తో ఈ డివైజ్‌ను మార్కెట్లో భాగం చేశారు. ఇందులో 6000 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఏఐ ఫీచర్లు, పెద్ద బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ 5 సంవత్సరాల పాటు మంచి పనితీరును పొందుతుందని కంపెనీ తెలిపింది.

వివో టీ4 లైట్ 5జీ పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కూడా సులభంగా కనిపిస్తుంది. కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ ఫోన్‌కు టీయూవీలో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఐపీ64 రేటింగ్ పొందింది. వివో టీ4 లైట్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంటీయూ బెంచ్‌మార్క్‌లో 43000 పాయింట్లు సాధించింది. 4 జీబీ నుంచి 8 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు. 12...