భారతదేశం, జూన్ 19 -- సోనీ తన కొత్త బ్రావియా 8 II సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 4కే ఓఎల్ఈడీ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఏఐ ప్రాసెసర్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో కూడిన 55 అంగుళాల, 65 అంగుళాల మోడళ్లు ఉన్నాయి. ప్రీమియం విజువల్స్, సౌండ్ క్వాలిటీ కోరుకునే యూజర్ల కోసం ఈ టీవీలను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ విశేషాల గురించి చూద్దాం..

సోనీ బ్రావియా 8 II సిరీస్ 55 అంగుళాల మోడల్ ధర రూ .2,46,990. 65 అంగుళాల మోడల్ ధర రూ.3,41,990గా ఉంది. సోనీ సెంటర్, సోనీ ఆన్లైన్ స్టోర్, ఇతర ప్రముఖ రిటైలర్లలో ఈ టీవీలు జూన్ 17, 2025 నుండి అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద 55 అంగుళాల మోడల్ మీద రూ.10,000, 65 అంగుళాల మోడల్ మీద రూ.15,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

సోనీ బ్రావియా 8 II సిరీస్ ఎక్స్‌ఆర్ ప్రాసెసర్ ను ఉపయోగిస్తుంది. ఇది అధునాతన ఏఐ టెక్నాలజీతో పిక...