భారతదేశం, జూన్ 25 -- హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ దిగ్గజం స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (SETL) బిజినెస్ మార్కెట్‌లో ఒక సంచలన డీల్ అనౌన్స్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏకంగా 51 శాతం మెజారిటీ ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇండియాలోని ఏఐ డేటా సెంటర్ మార్కెట్ రూపురేఖలను పూర్తిగా మార్చేయబోతోంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు టర్న్‌కీ ప్లాంట్స్ నిర్మించడంలో దశాబ్ద కాలంగా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఎస్ఈటీఎల్.. ఇప్పుడు డైరెక్ట్‌గా గ్లోబల్ ఏఐ డేటా సెంటర్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మెగా డీల్ వెనుక ఒక పవర్‌ఫుల్ బిజినెస్ లాజిక్ ఉంది. ఎస్ఈటీఎల్ గత పదేళ్లుగా ఫార్మా, బయోటెక్నాలజీ కంపెనీల కోసం హై-...