భారతదేశం, ఆగస్టు 24 -- ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో లెటర్‌లోని విషయాలను పోస్ట్ చేశారు. 'పదేళ్ళ వయసున్న రియాన్ష్‌ రెడ్డి తల్లి, ఆత్మహత్యకు పాల్పడ్డ సౌజన్య... తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికీ తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా ఈ అంశాలు చదవాలి. ఇది లవ్‌ జిహాద్‌కు సంబంధించిన ఘటన. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను కూడా బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాయి కాబట్టి, ప్రజలందరి దృష్టికీ రావాల్సిన ఆమె లెటర్‌లోని రిలవెంట్‌ అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నాను.' అని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇప్పుడు ఈ లేఖతో కాకినాడ జిల్లాలో నూకరాజు కుటుంబం ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు నూకరాజు కుమార్తె సౌజన్య రాస...