భారతదేశం, ఫిబ్రవరి 13 -- భారత ఆటోమొబైల్ రంగంలో వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న చిన్న కార్ల (Compact Cars) కంటే, ఇప్పుడు ఎస్‌యూవీల (SUVs) వైపే జనం మొగ్గు చూపుతున్నారు. 2026 జనవరి నెల విక్రయాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గడిచిన నెలలో ప్యాసింజర్ వాహనాల మార్కెట్ మొత్తం మీద 8 శాతం వృద్ధితో 3,79,394 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే, ఇందులో ఎస్‌యూవీల వాటా భారీగా ఉండగా, ప్యాసింజర్ కార్ల అమ్మకాలు మాత్రం నిరాశాజనకంగా సాగాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. ఎస్‌యూవీల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 15.9 శాతం వృద్ధి చెందాయి. 2025 జనవరిలో 2,12,995 ఎస్‌యూవీలు అమ్ముడవగా, ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య 2,46,844కు చేరింది.

మారుతీ సుజుకీ: 75,60...