భారతదేశం, జూన్ 25 -- ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు స్థానికత లేదా నివాస ధృవీకరణ పత్రం (డొమిసిల్ సర్టిఫికెట్) సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ సంస్కరణ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఇప్పటివరకు రెండు పథకాల కింద దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే డొమిసియల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండేది. అయితే, ఇతర రాష్ట్రాల్లో లేదా సొంత జిల్లా దాటి చదువుకునే విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఈ పత్రాన్...