భారతదేశం, నవంబర్ 16 -- భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సీకే కన్వెన్షన్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 'ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇన్స్‌స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్' అనే అంశంపై ప్రసంగించారు. తాను హాజరైన చివరి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో జరిగిందని, ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత మొదటిది మహారాష్ట్రలోని తన స్వస్థలం అమరావతిలో జరిగిందని గుర్తు చేశారు.

'భారత రాజ్యాంగానిది 75 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. న్యాయవాద ప్రస్థానం అమరావతిలో ప్రారంభమైంది. సుప్రీం కోర్టు ప్రధాన...