భారతదేశం, జూన్ 22 -- మీరు బ్యాంకులో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసం గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీఐ) రిక్రూట్‌మెంట్ 2025 కింద 2600 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియను మరోసారి ప్రారంభించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఇప్పుడు జూన్ 30, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ సీబీఓ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్‌లైన్ పోర్టల్‌లో తిరిగి తెరిచారు. దీనికి చివరి తేదీ జూన్ 30, 2025. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 2,964 ఖాళీలు అంటే 2,600 రెగ్యులర్, 364 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in/web/careers ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30 అని గుర్తుంచుకోండి. చివరి క్షణం వరకు వేచి ఉండ...