భారతదేశం, జూన్ 24 -- బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే యువతకు గుడ్ న్యూస్. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibpsonline.ibps.inలో ఎస్బీఐ పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్(SBI PO) పోస్టులకు జూన్ 24 నుంచి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులను ibpsonline.ibps.inలో జూలై 14 వరకు స్వీకరిస్తోంది. ఎస్బీఐ ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. మెుత్తం 541 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిలో 203 పోస్టులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉన్నాయి. 135 పోస్టులు ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ) కోసం, 50 పోస్టులు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం, 37 పోస్టులు షెడ్యూల్డ్ కులాలు (ఎ...