భారతదేశం, నవంబర్ 2 -- ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC). ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పూర్తి తొత్తుగా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల అక్రమాలకు ఎస్‌ఈసీ ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన మున్సిపల్ పోలింగ్ రోజు చోటుచేసుకున్న దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్)లో ప్రకటన విడుదల చేశారు.

పులివెందులలో జరిగాయని చెప్తున్న పోలింగ్ అక్రమాలపై జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో ఏకంగా 70 చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు లేకుండా చేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయటి ప్రాంతాల ను...