భారతదేశం, అక్టోబర్ 16 -- ఎల్‌నినో వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో అఖిల పక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి సహకారం కోరుతామని తెలిపారు. ఈ సంక్షోభ కాలం నుంచి గట్టెక్కడానికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి అన్ని శాఖలను అప్రమత్తం చేశారు.

ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, సాగు, తాగునీటి ఎద్దడి, తద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎల్‌నినో కారణంగా ఉత్పన్నమయ్య...