భారతదేశం, అక్టోబర్ 27 -- యువతను ఆకట్టుకునే డిజైన్, సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న 'నథింగ్' (Nothing) సంస్థ తమ ఫోన్ శ్రేణిని మరింత విస్తరించబోతోంది. ఈ క్రమంలో, త్వరలో 'నథింగ్ ఫోన్ 3ఏ లైట్' (Nothing Phone 3a Lite) స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఈ కొత్త మోడల్ అక్టోబర్ 29న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు (1:00 pm GMT) లాంచ్ కానుంది. ఇప్పటికే ఉన్న నథింగ్ ఫోన్ 3 శ్రేణికి అదనంగా రాబోతున్న ఈ 'లైట్' వెర్షన్, మెరుగైన ఫీచర్లతో పాటు మరింత సరసమైన ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనా.

నథింగ్ సంస్థ 3ఏ లైట్ డిజైన్‌ను టీజర్‌లో పంచుకుంది. ఫోన్ వెనుక భాగంలో కింది వైపున ఒక LED లైట్ కనిపిస్తోంది. ఇది నోటిఫికేషన్ ఇండికేటర్‌గా పనిచేసే అవకాశం ఉంది. సంస్థ ప్రత్యేకమైన, మినిమల్ డిజైన్ శైలి...