భారతదేశం, ఏప్రిల్ 1 -- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం స్పందించింది. వంటగ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడంతో.. గృహాలను ఆదుకునేందుకు దేశంలో కేవలం కమర్షియల్ ఎల్‌పీజీ ధరను మాత్రమే పెంచినట్లు, గృహ వినియోగ ఎల్‌పీజీ ధరను యథాతథంగా ఉంచినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

'పరిశ్రమలు, హోటళ్లు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉన్నాయి. మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయి. సాధారణంగా నెలవారీగా సవరిస్తారు. దేశంలో వినియోగించే మొత్తం ఎల్పీజీలో వీటి వినియోగం 10 శాతం కంటే తక్కువగా ఉంది.' అని మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా, 14.2 కేజీ...