భారతదేశం, జూన్ 17 -- గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేరడం ద్వారా మీ కెరీర్‌ను మెుదలుపెట్టాలని అని అనుకుంటే మీకోసం మంచి ఛాన్స్ ఉంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్‌లో బంపర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటిస్‌షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా మంచి స్టైఫండ్ లభిస్తుంది. ఈ నియామకం ద్వారా సంస్థలో 250 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అర్హతలు ఏంటో చూద్దాం..

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ నియామక ప్రక్రియలో పాల్గొనగలరు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల...