భారతదేశం, నవంబర్ 10 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. తొమ్మిదో వారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం సాయి శ్రీనివాస్‌తోపాటు ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను బిగ్ బాస్ బజ్ పేరుతో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేస్తాడు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూలో రాము రాథోడ్ పాల్గొన్నాడు. బొంబాయికి రాను పాటతో సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. రాముతో కలిసి శివాజీ కూడా పాటకు స్టెప్పులేశాడు. "బొంబాయి రాను పాట చేయడానికి ఎన్నాళ్లు పట్టింది" అని శివాజీ అడిగాడు. దానికి "ఐదేళ్లు" అని సింగర్ రాము ఆన్సర్ ఇచ్చాడు.

"ఒక సక్సెస్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఐదేళ్లు డే అండ్ నైట్ కష్టపడితే సక్సెస్ వచ్చింది. మరి కప్పు కొట్టడానికి కేవలం 15 వారాల. ఎవరైనా...