భారతదేశం, జూలై 6 -- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, 2024లో డొనాల్డ్ ట్రంప్‌ను రెండోసారి అధికారం వైపు నడిపించిన కింగ్ మేకర్ ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోకి స్వయంగా ప్రవేశించారు. అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అమెరికాలో 80 శాతం ఓటర్ల గొంతుకగా ఈ పార్టీ మారుతుందని మస్క్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ ప్రకటన సహజమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎందుకంటే, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అమెరికా పార్లమెంటులో బిగ్ బ్యూటిఫుల్ చట్టాన్ని ఆమోదించారు. మస్క్ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, అమెరికా ప్రజల కోసం కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. ఈ బిల్లు అమెరికా ప్రజలకు వినాశకరమని మస్క్ అభివర్ణించారు. ఈ బిల్లు కేవలం ధనవంతులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందని, పేద, మధ్యతరగతికి క...