భారతదేశం, ఆగస్టు 16 -- అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు ముగిశాయి. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశం ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగకుండానే ముగిసింది. చర్చల సమయంలో ప్రధాన అంశం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎలా ముగించాలనేది. అయినప్పటికీ రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఈ ముఖ్యమైన సమావేశం కోసం అలాస్కా రాజధాని యాంకరేజ్‌లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

అలాస్కాలో చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేం త్వరలో మీతో మాట్లాడుతామని, బహుశా త్వరలో మళ్ళీ కలుద్దామని అన్నారు. దీనికి పుతిన్ తదుపరిసారి మాస్కోలో అని అన్నారు. భేటీ తర్వాత ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సమావేశం ఫలప్రదంగా సాగినట్టుగా పేర్కొన్నారు. కొన్ని విషయాలు పరిష్కరి...