ఎర్రవల్లి భూముల్లో 45 ఎకరాలు మిస్సింగ్.. అక్కడే అమరవీరుల కాలనీ : సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశం, అక్టోబర్ 6 -- సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూములకు సంబంధించి తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ రికార్డులకు, క్షేత్రస్థాయి పరిశీలనకు మధ్య భారీ తేడా కనిపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే సర్వే నోటిఫికేషన్ జారీ చేసి మిస్సింగ్ భూముల వివరాలు తేల్చాలని ఆదేశించారు.
ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న భూములపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు. సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి నమోదు అయి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 343 ఎకరాలు మాత్రమే కనిపిస్తోంది. మిగిలిన 45 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డుల నుంచి మాయమైనట్లు అధికార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.