భారతదేశం, జూన్ 19 -- దేశాన్ని మొత్తం దుఃఖంలో ముంచెత్తిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి వారం రోజులు అవుతుంది. విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. ప్రమాద స్థలం నుండి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్‌ను పరీక్ష కోసం అమెరికాకు పంపాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బ్లాక్ బాక్స్ తీవ్రంగా దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం అమెరికాలో దాని సీవీఆర్, ఎఫ్‌డీఆర్‌లను పరిశీలించాలని నిర్ణయించే అవకాశం ఉంది.

బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు పరికరాలను కలిగి ఉంటుంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్‌డీఆర్). కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం నుండి స్వాధీనం చేసుకున్న 'బ్లాక్ బాక్స్'ను పరీక్ష కోసం వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్‌ను అమెరికాకు పంపితే అన్ని ప్రోటోకాల్‌లు...