భారతదేశం, జూన్ 19 -- హ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా పెద్ద నిర్ణయం తీసుకుంది. 15 శాతం అంతర్జాతీయ విమానాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా తన వైడ్‌బాడీ విమానాల అంతర్జాతీయ విమానాలలో, ముఖ్యంగా బోయింగ్ 787, బోయింగ్ 777లను 15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో మరింత తనిఖీలు చేపటనున్నట్టుగా తెలిపింది.

ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ స్థిరత్వం, సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఎయిర్ ఇండియా తన వైడ్ బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను 15 శాతం తగ్గింపును ప్రకటించింది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూరప్, తూర్పు ఆస...