భారతదేశం, ఆగస్టు 11 -- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా యువతకు గొప్ప ఉద్యోగ అవకాశాన్ని అందించింది. ఈ సంస్థ 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు ప్రభుత్వ ఉద్యోగంతో మెరుగైన కెరీర్ కోసం చూస్తే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.

దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28, 2025 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 27, 2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు aai.aero అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 11 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీర్-సివిల్) - 199 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) - 208 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 527 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటి...