భారతదేశం, అక్టోబర్ 18 -- స్మార్ట్‌ఫోన్లు, 4జీ, 5జీ డేటా వాడని సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్ శుభవార్త అందించింది. ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు మాత్రమే వాడుకునే వారి కోసం మూడు కొత్త 'వాయిస్-ఓన్లీ' రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన అక్టోబర్ 21 గడువు కంటే కొన్ని రోజుల ముందు ఎయిర్​టెల్ ఈ ప్లాన్లను ప్రవేశపెట్టడం విశేషం.

ఎయిర్​టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వాయిస్ ఓన్లీ మూడు ప్లాన్ల వివరాలు ఇప్పటికే 'ఎయిర్​టెల్ థాంక్స్' యాప్‌లో ఉన్నాయి. అవి..

ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలోనూ వినియోగదారులు అపరిమిత ఉచిత లోకల్, నేషనల్ కాలింగ్ సదుపాయంతో పాటు ఉచితంగా 300 ఎస్ఎంస్​లు పొందుతారు.

అయితే ఈ ఎయిర్​టెల్ వాయిస్ ఓన్లీ ప్లా...